బహుభాషా కోవిదుడు… గొప్ప రాజనీతిజ్ఞుడు PV:తలసాని

102
talasani
- Advertisement -

మాజీ ప్రధానమంత్రి PV. నర్సింహా రావు 17 వ వర్ధంతి సందర్భంగా PV మార్గ్ లో గల PV జ్ఞాన భూమి లోని PV సమాధి వద్ద పూల మాలలు వేసి నివాళులు అర్పించారు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి. తలసాని శ్రీనివాస్ యాదవ్. పీవీ బహుభాషా కోవిదుడు…గొప్ప రాజనీతిజ్ఞుడు అని కొనియాడారు తలసాని.

ప్రధానమంత్రి గా PV నర్సింహా రావు తీసుకొచ్చిన సంస్కరణలతో దేశం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. సమర్ధవంతమైన పాలనతో ప్రపంచ దేశాలలో భారత దేశ ఖ్యాతిని చాటిన మహోన్నత వ్యక్తి పీవీ అన్నారు. అన్ని భాషల్లో మాట్లాడగల వ్యక్తి….ఈ దేశం గర్వించదగ్గ వ్యక్తి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం శత జయంతి వేడుకలు ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు.

ఢిల్లీ లో కనీసం పీవీ ఘాట్ లేదు…తెలుగు వారు అంటే కేంద్రంలో గౌరవం లేదన్నారు. పీవీ భారీ విగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసి గౌరవించిందన్నారు.ఎన్నో పుస్తకాలు పీవీ గారి మీద వచ్చాయి..పుస్తక ప్రియులు అవి చదువుకోవాలన్నారు.జాతి రత్నం గా పీవీని పిలుస్తున్నాం అన్నారు ఎమ్మెల్సీ వాణిదేవి. శత జయంతి ఉత్సవాలు జరిపింది తెలంగాణ ప్రభుత్వం. ఇంత పెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ లేదు..తన విఘ్నత తో దేశంలో ఎన్నో సంస్కరణలు చేశారన్నారు.

- Advertisement -