విశాల్… ‘సామాన్యుడు’

172
vishal
- Advertisement -

విశాల్ ‘సామాన్యుడు’ చిత్రంతో తు ప శరవణన్ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ యాక్షన్ డ్రామాకు నాట్ ఏ కామన్ మ్యాన్ అనేది ఉపశీర్షికగా ఫిక్స్ చేశారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద ఈ సినిమాను విశాల్ నిర్మిస్తున్నారు.

విశాల్ గత చిత్రాలకు పని చేసి ఎన్నో సూపర్ హిట్ ఆల్బమ్స్ ఇచ్చిన యువన్ శంకర్ రాజా సామాన్యుడు సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చనున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి థీమ్ మ్యూజిక్‌ను విడుదల చేశారు. ఇందులోని లిరిక్స్ ఎంతో స్పూర్తివంతంగా ఉన్నాయి. ఈ పాటను నివేదిత ఆలపించారు.

డింపుల్ హయతి ఈ చిత్రంలో విశాల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు. యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తుండగా.. కెవిన్ రాజా సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నటీనటులు : విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి

సాంకేతిక బృందం

డైరెక్టర్ : తు ప శరవణన్
నిర్మాత : విశాల్
సంగీతం : యువన్ శంకర్ రాజా
డీఓపీ : కెవిన్ రాజా
ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్
ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి
కాస్ట్యూమ్ డిజైనర్ : వాసుకి భాస్కర్
పీఆర్వో : వంశీ శేఖర్
పబ్లిసిటీ డిజైన్ : విక్రమ్ డిజైన్స్

- Advertisement -