జాతి గర్వించదగ్గ వ్యక్తి..పీవీ: తమిళి సై

25
gov

యువతకు రోల్ మోడల్..జాతి గర్వించదగ్గ వ్యక్తి పీవీ నరసింహరావు అని కొనియాడారు గవర్నర్ తమిళి సై. పీవీ ఘాట్‌లో నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడిన తమిళి సై..బహుభాషా కోవిదుడు పీవీ అన్నారు. 9 జాతీయ,8 ఇతర దేశాల భాషలు మాట్లాడగల వ్యక్తి అని గుర్తుచేశారు. జాతిపిత గా పీవీ ని పిలుస్తారు..ఆర్థిక సంస్కరణలు చేసిన వ్యక్తి పీవీ అన్నారు.

నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పీవీ అన్నారు బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణ మోహన్. వెనకబడిన తరగతులకు రిజర్వేషన్లు అమలు చేసిన వ్యక్తి అన్నారు. ఓబీసీ లకు ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లు కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. బీసీ కమిషన్, మైనారిటీ కమిషన్లు ఏర్పాటు చేసిన మహానీయుడు అన్నారు.