కరోనా నేసథ్యంలో కార్పొరేటర్లు ప్రతి రోజు రెండు గంటల పాటు తమ డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని పిలుపునిచ్చారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా నియంత్రణపై బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన కరోనా నియంత్రణ కోసం అన్ని ప్రాంతాల్లో సోడియం హైపోక్లోరైడ్ పిచికారీతో పాటు దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు.
నగరంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 85వేల మంది ఉపాధి కోసం వలస వచ్చి పలు ప్రాంతాలలో నివసిస్తున్నారని వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించి వారిని క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకుగా నగరంలోని 150 డివిజన్లలో నిర్వహిస్తున్న పిచికారీ పనులను ముగ్గురు సీనియర్, 17మంది అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు పర్యవేక్షిస్తున్నారి ఈ సందర్భంగా అధికారులు ..మంత్రికి వివరించారు.