Talasani:బీఆర్ఎస్‌తోనే ప్రజాగళం

22
- Advertisement -

మన ప్రభుత్వం పోతుంది అని కలలో కూడా అనుకోలేదు అన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన తలసాని…అధికారం కోల్పోయిన తరవాత ప్రజలకు అర్ధమై పోయిందని…రైతులుకు పడుతున్న బాధలు చూస్తున్నాం అన్నారు.ఎందుకు కేసీఆర్ ని పోగొట్టుకున్నాము అని ప్రజలు బాధపడుతున్నారు..బి ఆర్ ఎస్ పార్టీ రాగిడి లక్ష్మారెడ్డి అభ్యర్థి గా పెట్టిన పార్టీ నాయుకులు, కార్యకర్తలే అభ్యర్థి గా అనుకోని పని చేయాలన్నారు.

మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేసాం ప్రజలకు గుర్తుచేయాలని…కెసిఆర్ హయాంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వంలో ఉన్న తేడాను ప్రజలకు వివరించాలన్నారు. ఈ ప్రభుత్వం నీటి సమస్య , కరెంట్ సమస్యను ప్రజలకు వివరించాలని.. పది సంవత్సరాలకు ముందు నీటి సమస్య చాలా ఉండే ట్యాంక్ లు వద్దా కొట్టుకుంటుండే అన్నారు.

ఇప్పుడు మళ్ళీ అలాంటి రోజులను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిందని,మల్కాజగిరి పార్లమెంట్ లో మనకు ఉన్న బలం ఎవరికీ లేదు..మల్కాజగిరి పార్లమెంట్ తో పాటు కంటోన్మెంట్ ఎన్నికలు ఉన్నాయా కాబట్టి మన అభ్యర్థి లను గెలిపించుకోవాలన్నారు. బి ఆర్ ఎస్ పార్టీని మల్కాజగిరి అభ్యర్థిని గెలిపిస్తేనే మల్కాజగిరికి న్యాయం జరుగుతుంది, మన గళం పార్లిమెంట్ లో వినపడుతుందన్నారు.

Also Read:సీఎం రేవంత్‌తో వీహెచ్‌ భేటీ

- Advertisement -