- Advertisement -
దాడి టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ భావాలతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
గాంధీ జయంతి సందర్భంగా ఈ చిత్రం నుంచి స్వరబ్రహ్మ మణిశర్మ బాణీలు సమకూర్చిన ‘ఎవరి కోసం’ అంటూ సాగే టైటిల్ సాంగ్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. “పాట చాలా బాగుంది. సంగీతం, పిక్చరైజేషన్ ఆకట్టుకుంటున్నాయి.
మధుశోభ టి దర్శకత్వంలో శంకర్ నిర్మిస్తోన్న ఈ మూవీలో శ్రీరామ్, అక్షర, జీవన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్ కు మంచి స్పందన వస్తోంది.
- Advertisement -