హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ మాసబ్ ట్యాంక్ లోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో మొబైల్ ఫిష్ ఔట్లెట్స్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు పశుసంవర్ధక ,మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ముఖ్యమంత్రి కెసిఆర్ న్యాయకత్వంలో రాష్ట్రంలో నూతన ఒరవడి మొదలైంది..
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి కులవృత్తుల మీద ఆధారపడే జీవితాలలో వెలుగు నింపేంటువంటి ఉదేశ్యం తో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అన్నారు. ఈరోజు ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో భారతదేశం ఊహించని విధంగా మన రాష్ట్రంలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి..
రాష్ట్రం ఏర్పడక ముందు గత ప్రభుత్వాలు తెలంగాణ వ్యాప్తంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్ కు బడ్జెట్ కేటాయించక మన రాష్ట్రంలో ఫిషర్ మెన్ కమ్యూనిటీ లేదనే విధంగా ప్రవర్తించాయి..రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రంగం మీద ఆధారపడి జీవిస్తున్న వారి జీవితాల్లో వెలుగు నింపే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకున్న స్థాయిలో బడ్జెట్ ఇచ్చి 100శాతం సబ్సిడీ ఇచ్చారు..చేప సీడ్ తో పాటు వారికి కావాల్సిన వెహికిల్స్,నెట్లతో పాటు ఈ వృత్తికి కావాల్సిన పరికరాలు ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాము..గ్రేటర్ హైదరాబాద్ లో 150 మొబైల్ అవుట్లెట్స్ పెట్టాలనే సంకల్పంతో ఈ వాహనాలను డిజైన్ చేశామన్నారు.నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ సహకారం ,రాష్ట్ర ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇక్కడి బెనిఫిషియర్స్ సంయుక్తంగా ఈరోజు రెండు వాహనాలు ప్రారంభిస్తున్నాం..
చేపలు ఆరోగ్యానికి చాలా అవసరం….హైదరాబాద్ లో చేపలు అమ్మే మార్కెట్లు చాలా తక్కువ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరికి చేపలు అందుబాటులోకి రావాలని విటీని ప్రారంభించాం అన్నారు.ఒక చోట నుండి మరో చోట అమ్ముకునేందుకు వెసులుబాటు ఉంది ఇందులో 5 గురికి పని దొరుకుతుంది.దీని ద్వారా మూడు నుండి నాలుగు కుటుంబాలు జీవనోపాధి పొందుతాయి..ప్రతి ఒక్క జిల్లాలో మార్కెటింగ్ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటాం.రాబోవు రోజుల్లో రాష్ట్రమంతా మరిన్ని ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.