- Advertisement -
పేదల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రాష్ట్రంలో ప్రస్తుతం 36 లక్షల మందికి ఆసరా పెన్షన్లు అందుతున్నాయని చెప్పారు. సికింద్రాబాద్‌లోని డీఆర్డీవో కార్యాలయంలో కొత్తగా పెన్షన్లు మంజూరైన లబ్ధిదారులకు మంత్రి తలసాని పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన తలసాని… రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధికి టీఆర్‌ఎస్ సర్కార్ అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాకముందు రూ.2 వందలుగా ఉన్న పెన్షన్ ను సీఎం కేసీఆర్ రూ.2016కు పెంచారన్నారు.దేశంలో ఎక్కడా లేని విధంగా పేదింటి ఆడపడుచు పెండ్లికి లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని చెప్పారు. ప్రజల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.
- Advertisement -