చనిపోయిన వారి గుర్తుగా మొక్కను నాటండి: హరీశ్‌

26
Minister Harish Rao
- Advertisement -

తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి వచ్చే మొక్కలు నర్సరీల్లో అందుబాటులో ఉన్నాయని….ఇలాంటి నర్సరీలతో నగరాలు, పట్టణాలలో మిద్దెతోటల సాగు పెరుగుతుందన్నారు మంత్రి హరీశ్ రావు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో 12వ గ్రాండ్‌ నర్సరీ మేళాను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీశ్‌… చనిపోయిన వారికి గుర్తుగా ఒక మొక్కను నాటి.. వారిని స్మరించుకోవాలన్నారు. నగర వాసులకు ఇదో మంచి అవకాశమని, హోంగార్డెన్‌, టెర్రస్‌ గార్డెన్‌, వర్టికల్‌ గార్డెన్‌, కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలనుకునే వారికి ఇదో మంచివేదిక అన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు నియోజక వర్గానికి కూడా నర్సరీ ఉండేది కాదని, గత ప్రభుత్వాల హయాంలో ఒక మొక్క నాటి ఫొటోలు దిగేవారన్నారు.గ్రీన్ టాక్స్ పెట్టి ప్రకృతి వనాల పెంపకానికి ప్రభుత్వం తరఫున తోడ్పాటు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలోని మొత్తం 12,751 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల పేరిట నర్సరీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చక్కటి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పొందేందుకు ఇంట్లో మొక్కలు పెంచుకోవాలన్నారు.

- Advertisement -