ప్రభుత్వంపై నెట్టివేసిన సుప్రీం కోర్టు !

228
talaq thrice banned by the Supreme Court
talaq thrice banned by the Supreme Court
- Advertisement -

ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని, పార్లమెంట్ ఆరు నెలల్లోగా చట్టం చేసే వరకూ తలాక్ చెప్పడాన్ని నిషేధిస్తున్నామని సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఖేహార్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. వివిధ మతాలకు చెందిన ఐదుగురు న్యాయమూర్తులు కేసును విచారించగా, ముగ్గురు సభ్యులు తలాక్ చెల్లదని స్పష్టం చేయగా, మరో ఇద్దరు మాత్రం వేలాది సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయాలను తేలికగా తొలగించలేమని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం చట్టం తెచ్చేంత వరకు ఎలాంటి పిటిషన్లు తీసుకోబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. చట్టం చేసిన తర్వాతే దానికి లోబడి కేసులను విచారిస్తామని, చట్టం చేయడానికి కేంద్రానికి ఆరు నెలల గడువిచ్చింది ధర్మాసనం. అప్పటివరకూ ట్రిపుల్‌ తలాక్‌ చెల్లుబాటు కాదని స్పష్టం చేసింది. అంతేగాక ఇప్పటివరకూ చేపట్టిన విచారణను న్యాయస్థానం రిజర్వ్‌లో పెట్టింది.

ఇక ఎన్నో ఇస్లామిక్ దేశాలు ట్రిపుల్ తలాక్ పై ఎప్పటినుంచో నిషేధాన్ని అమలు చేస్తున్నాయని గుర్తు చేసిన న్యాయమూర్తులు, ఇక్కడెందుకు నిషేధం విధించరాదని తన తీర్పులో ప్రశ్నించారు. తలాక్ చెప్పడం కచ్చితంగా చట్ట విరుద్ధమేనని, ఇది మహిళల హక్కులను హరిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే, ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని తాము భావించడం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. తలాక్ ను నిషేధించాలని జస్టిస్ నారియమన్, జస్టిస్ కురియన్, జస్టిస్ లలిత్ లు అభిప్రాయపడగా, చీఫ్ జస్టిస్ ఖేహార్, జస్టిస్ నాజిర్ లు మాత్రం ఇప్పటికిప్పుడు వద్దని, మరింత వాదన జరగాల్సి వుందని అన్నారు.

- Advertisement -