ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వర్షాలు, వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌తో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. ట్యాంక్‌బండ్ పరిస్థితి, వరదలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
భారీ వర్షాలు, వరదల పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులు తెగిపోవడం, గండ్లు పడటం, పంటలు దెబ్బతినడం వంటి నష్టం జరిగిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్థిరాస్తులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, పంటనష్టం, మౌలిక వసతులకు కలిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక తయారు చేయాలని ఆదేశించారు.
రాష్ర్టానికి తగిన సాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు సీఎం తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సీఎస్ రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు. జరిగిన నష్టంపై అంచనాలు రూపొందించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశించారు.