గ్రేటర్‌లో భారీవర్షం..లోతట్టు ప్రాంతాలు జలమయం

122
Telangana Rains
- Advertisement -

ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసిముద్దైంది. ఎడతెరపిలేకుండా మూడు గంటల పాటు కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

సహాయం కోసం కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేశారు అధికారులు. ఏదైనా సహాయం అవసరమైనవారు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ 040 2111 1111, డీఆర్‌ఎఫ్‌ కంట్రోల్‌ రూమ్‌ 040 2955 5500, 9000 113 667 నంబర్లను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు.

చాంద్రాయణగుట్ట పరిధిలోని పలు బస్తీల్లో ఇళ్లలోకి నీరు చేరింది. జంగమ్మెట్ డివిజన్‌ లక్ష్మీనగర్‌ ఇండ్లలోకి భారీగానీరు చేరింది. జిల్లెలగూడలోని బాలాజీ కాలనీ జలదిగ్భంధమయింది. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురిలో భారీగా వరద ప్రవహిస్తున్నది.

- Advertisement -