ఎవరైన చనిపోతే వారి అంతిమయాత్ర ఎలా ఉంటుంది..?అందరి బంధువులు హాజరై…డప్పు చప్పుళ్లతో వారిని సాగనంపుతారు. ఊరేగింపులు డ్యాన్స్ వేస్తుండడం అక్కడక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇక హైదరాబాద్ లాంటి నగరంలోనైతే అలాంటి సందడి కూడా ఉండదు. ప్రత్యేక వాహనంలో కేవలం దగ్గరి బంధువులు మాత్రమే స్మశానానికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహిస్తారు. కానీ ఓ శవయాత్రలో బార్ గర్ల్స్ డ్యాన్స్ చేయటం ఎప్పుడైనా చూశారా..?అది కారు మీదెక్కి…అలాంటి వెరైటీ శవయాత్ర తైవాన్‌లో జరిగింది.
వివరాల్లోకి వెళ్తె…. తంగ్ హ్సింగ్(76)తైవాన్ లో ఓ ప్రాంతానికి కౌన్సిలర్ గా వ్యవహరిస్తున్నారు. అనారోగ్య కారణౄలతో తంగ్ డిసెంబర్ లో మృతి చెందాడు. ఇక తంగ్ అంతిమయాత్రను ఘనంగా నిర్వహించాలనుకున్న కుటుంబసభ్యులు ఏకంగా బార్ డ్యాన్సర్లతో డ్యాన్సులు వేయించారు. అంతిమయాత్రలో వెళుతున్న జీపులపై ఒక్కసారిగా ముందు జీపులు బికినీలు ధరించిన ముద్దుగుమ్మలు ప్రత్యక్షమయ్యారు. జీపుల పైకి ఎక్కి పాటలు పాడుతూ డ్యాన్స్ చేశారు.
వీరి డ్యాన్స్‌తో పాటు డప్పుచప్పుళ్లతో తంగ్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపుగా పెండ్లి బరాత్‌ను తలపించే విధంగా వీరి నృత్యం సాగింది. దీంతో స్ధానికులు ఈ శవయాత్రను తమ సెల్ ఫోన్‌లో చిత్రీకరించారు. సోషల్ మీడియాలో అప్ డేట్ చేశారు. ఇప్పుడు తెగ వైరలైంది. దీనిపై వివరణ ఇచ్చిన కుటుంబసభ్యులు తన అంత్యక్రియలను ఫుల్ జోష్ తో నిర్వహించాలని తంగ్ హ్సింగ్ చనిపోయే ముందు చెప్పారని, అందుకే ఇలా నిర్వహించామని తెలిపారు. మొత్తానికి చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్న నానుడి అక్షరాలా నిజమైందంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టులు చేస్తున్నారు.
https://youtu.be/TZ2XtwGa_BI