పలు దేశాల ప్రతినిధులతో తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. రిప్లబిక్ అప్ కొరియా రాయబారి చో హ్యూన్ తో మంత్రి కెటి రామారావు డీల్లీలో ఈ రోజు సమావేశం అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలను రాయభారికి వివరించారు మంత్రి కెటి రామారావు. తెలంగాణలో ఐటి, మౌళిక వసతులు, ఫార్మ రంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించిన మంత్రి, కొరియన్ కంపెనీలతో తెలంగాణ వ్యాపార వాణిజ్యరంగాల సంబంధాల బలోపేతం దిశగా సహాకరించాలని మంత్రి, కొరియా రాయబారిని కోరారు.
తైవాన్ ఎలక్ర్టికల్ మరియు ఎలక్ర్టానిక్ మ్యానిఫాక్చరర్స్ అసోషియేషన్ (టీమా) ప్రతినిధి బృందం మంత్రి కెటి రామారావుని కలిసింది. తైవాన్ అర్ధిక వ్యవహరాల శాఖ ఉప మంత్రి మే హువాంగ్, టీమా చైర్మన్ టి సి గో అద్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తైవాన్ ఎలక్ర్టానిక్ తయారీ సంస్ధలను తెలంగాణాకు మంత్రి అహ్వనించారు. తైవాన్ కంపెనీలకు తెలంగాణ రాష్ర్టం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ర్ట ఎలక్ట్రానిక్స్ పాలసీ గురించి వివరించారు. పాలసీ ముఖ్యాంశాలను వివరించిన మంత్రి, తైవాన్ కంపెనీలకు ఇక్కడ ఉన్న వ్యాపారానుకూల వాతావరణాన్ని, అందుబాటులో ఉన్న మానవ వనరులను మంత్రి కెటి రామారావు టీమా బృందానికి వివరించారు. తైవాన్ లోని తైపీలో ఈ ఎడాది అక్టోబర్ మాసంలో జరిగే Taiwan-India Industrial Collaboration Summit కు హజరు కావాల్సిందిగా మంత్రికి అహ్వానం అందించారు.
ఈ సమావేశంలో డీల్లీలో తెలంగాణ రెసిడెంట్ కమీషనర్ అరవింద్ కూమార్ తోపాటు, ఐటి శాఖ ఏలక్ర్టానిక్స్ విభాగ డైరెక్టర్ సుజయ్ కారంపూరి ఉన్నారు.