పెళ్లిపై హీరోయిన్ తాప్సీ సంచలన కామెంట్స్..!

154
Taapsee
- Advertisement -

గత కొంతకాలంగా హీరోయిన్ తాప్సీ విదేశీ బ్యాడ్మింటన్ ఆటగాడు, కోచ్ మథయాస్ బో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంత కాలంగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. వీరిద్దరి ప్రేమాయణం గురించి మీడియాలో పుంఖానుపుంఖాలుగా ఆసక్తికర కథనాలు వచ్చాయి. తాజాగా తన పెళ్లి గురించి తాప్సీ స్పందించింది.

తన తల్లిదండ్రులకు నచ్చని వ్యక్తిని తాను పెళ్లి చేసుకునే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేసింది. తాను డేటింగ్ చేసిన ప్రతి వ్యక్తితో ఇదే విషయాన్ని క్లియర్‌గా చెప్పానని తెలిపింది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే తాను రిలేషన్ షిప్ కోసం సమయాన్ని కేటాయిస్తానని.. అనవసరంగా టైమ్ పాస్ చేయనని తెలిపింది. తాను పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతాననే భయం తన తల్లిదండ్రుల్లో ఉందని చెప్పింది.

కెరీర్ పరంగా తాను సాధించాల్సింది ఇంకా ఉందని తాప్సీ తెలిపింది. అనుకున్నది సాధించిన తర్వాత… వర్క్ పరంగా కొంత నెమ్మదిస్తానని, సంవత్సరానికి ఐదారు సినిమాలు కాకుండా, రెండు, మూడు సినిమాలు మాత్రమే చేస్తానని చెప్పింది. అప్పుడు తన వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించే సమయం తనకు దొరుకుతుందని తెలిపింది. ఇక తాప్సీ పలు బాలీవుడ్‌, టాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది.

- Advertisement -