మా ఎన్నికలు.. ప్రకాష్ రాజ్‌కు నరేష్‌ కౌంటర్‌..

105
Naresh

టాలీవుడ్‌లో ప్రస్తుతం మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి. సెప్టెంబర్ లో ఎలక్షన్స్ జరుపుతామని ‘మా’ జనరల్ బాడీ ప్రకటించగా.. మూడు నెలల ముందుగానే ఇండస్ట్రీలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. అధ్యక్ష బరిలో ఉన్నామంటూ ఇప్పటికే ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు – జీవితా రాజశేఖర్ – హేమ – సీవీఎల్ నరసింహారావు పోటాపోటీగా ప్రకటనలు ఇచ్చేశారు. ఈ క్రమంలో ఎన్నడూ లేని విధంగా సార్వత్రిక ఎన్నికల తరహాలో ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారే పరిస్థితి క్రియేట్ అయింది.

ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ను ప్రకటించిన రోజు నుంచి విమర్శలు, ఆరోపణలతో వాడీవేడి చర్చలు జరుగుతున్నాయి. అయితే వారంలో ఇష్యూ కాస్త సర్దుమణిగింది అనుకునేలోపు మరోసారి వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇటీవల ప్రకాశ్‌రాజ్‌ ‘ఎన్నికలు ఎప్పుడు జస్ట్‌ ఆస్కింగ్‌’ అని ట్వీట్‌ చేశారు. దీనిపై ప్రస్తుతం ‘మా’ అధ్యక్షుడు నరేష్‌ ఘాటుగా స్పందించారు. ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న వారికి మా సమాధానమిదే అంటూ సెటైర్‌ వేశారు. ‘సెప్టెంబర్‌లో ‘మా’ ఎన్నికలు జరుగుతాయని ఎన్నోసార్లు స్పష్టం చేసినప్పటికీ కొందరు ఎన్నికలు ఎప్పుడు అని మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తుంటే.. ‘నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్‌ పూల్‌లోకి దూకనా?’ అని అడిగినట్లు ఉంది’ అంటూ నరేష్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం ఫోర్స్‌లో ఉన్న జనరల్‌ బాడీ మీటింగ్‌ వాయిదా పడింది. అంతా చక్కబడిన తర్వాత మీటింగ్‌ నిర్వహించి జరిగిన సేవా కార్యక్రమాల గురించి వెల్లడిస్తాం’’ అని నరేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు.