వెండితెరపై ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. క్రీడా,సినీ,రాజకీయ రంగాల్లో ఓ వెలుగు వెలిగిన వారి బయోపిక్‌లు ఇప్పటివరకు సినిమాగా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహిళల వెయిట్ లిఫ్టింగ్ లో భారత్ కు ఒలింపిక్ పతకాన్ని సాధించిపెట్టిన కరణం మల్లేశ్వరి జీవిత కథ సినిమాగా వస్తోంది.
తాజాగా సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. సంజనా రెడ్డి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో మల్లేశ్వరిగా ప్రముఖ నటి తాప్సీ నటించే అవకాశం కనిపిస్తోంది. ఈమేరకు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు.ఎమ్వీవీ సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మిస్తుండగా పాన్ఇండియా మూవీగా పలు భాషల్లో తెరకెక్కించనున్నారు.
ఒలింపిక్స్‌లో ఇండియా తరఫున రెండుసార్లు బరిలోకి దిగిన మల్లేశ్వరి.. 1998 బ్యాంకాక్‌లో జరిగిన పోటీల్లో 63 కిలోల విభాగంలో రజతం, 2000లో సిడ్నీలో జరిగిన పోటీల్లో కాంస్యం పతకం గెల్చుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో మల్లేశ్వరి చేసిన కృషికిగానూ అర్జున అవార్డు, రాజీవ్ ఖేల్‌రత్న, పద్మశ్రీ పురస్కారాలతో సత్కరించింది భారత ప్రభుత్వం.