మొక్కలు నాటిన తాడూరి శ్రీనివాస్…

139
taaduri srinivas
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి తార్నాక లోని తన నివాసంలో మొక్కలు నాటారు టి.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర సెక్రెటరీ తాడురి శ్రీనివాస్.

అనంతరం మాట్లాడుతూ మొక్కలు నాటడం చాలా ముఖ్యమని భవిష్యత్ తరాల కోసం మనమందరం బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అందరు కూడా ఏదో ఒక్క రకంగా మొక్కలు పెంచడం కోసం బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఛాలెంజ్ ఇదేవిధంగా కొనసాగాలని తెలుపుతూ తాను మరొ ముగ్గురు (ఇంజనీరింగ్ కాలేజస్ సెక్రెటరీ సునీల్ కుమార్ , దుగుంట్ల నరేష్ , నాయిని బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నాయి బాలక్రిష్ణ ) లు కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.

- Advertisement -