ఐటీ రంగంలో రెండోస్ధానంలో తెలంగాణ: కేటీఆర్

208
ktr
- Advertisement -

రాష్ట్రంలో ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరుకున్నాయని…. ఐటీ రంగంలో తెలంగాణ రెండో స్థానంలో ఉందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఐటీ హబ్‌ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్…. ఐదేండ్లలో ఐటీ ఎగుమతులు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.

ఐటీ నిర్వచనం క్రమంగా మారుతున్నదని, ప్రస్తుతం ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీగా మారిందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మాస్కులు వేసుకున్నదీ? లేనిదీ తెలుస్తున్నదని, కొవిడ్ నియంత్రణలో తెలంగాణ కీలకపాత్ర పోషిస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీని విస్తరింపజేస్తున్నామని తెలిపారు.

కరీంనగర్‌లో టాస్క్‌, టీహబ్‌ కేంద్రాలను ఏర్పాటుచేస్తున్నాం.పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పారు. యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషిచేస్తున్నదని వెల్లడించారు. పోటీ ప్రపంచంలో స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ను పెంపొందించుకోవాల్సిన అవసరమున్నదని అన్నారు. పట్టణాలు, గ్రామీణ యువత ఐటీలో సత్తా చూపుతున్నారని, స్థానిక స్టార్టప్‌లను అధికారులు ప్రోత్సహించాలని సూచించారు.

- Advertisement -