నిద్రలేమి సమస్య…అయితే ముప్పే!

220
sleepng
- Advertisement -

నిద్రలేమి అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఇబ్బందిగా మారిన రుగ్మత. సాధారణంగా పగటి నిద్రపోవడం, నిద్రాణస్థితి, మానసికంగా మరియు భౌతికంగా అనారోగ్యంగా ఉండటంతో పలు రకాల సమస్యలు నిద్రలేమి సమస్యకు దారితీస్తాయి. ఫలితంగా చిరాకు,మానసికంగా ఆందోళన చెందడం,ఏ పనిపై దృష్టి సారించకపోవడంతో పాటు అనేకమైన దీర్ఘకాలిక వ్యాధుల బారీన పడే ప్రమాదం ఉంది.

మీకు సరిగా నిద్రపట్టడం లేదంటే, అందుకు ఆకలి కూడా ఒక కారణం కావచ్చు. కాబట్టి, ఒక ఆరోగ్యకరమైన భోజనం ముగించిన తర్వాత కూడా మీకు ఆకలిగా అనిపిస్తుంటే, అటువంటి సమయంలో క్రాకర్స్ లేదా గోధుమలతో తయారు చేసి స్నాక్స్ ను తినవచ్చు.కొన్ని రకాల హెర్బల్ టీలు నిద్రపట్టేందుకు సహాయపడుతాయి. భోజనం తర్వాత కొంత నడక సారించడం వల్ల గాఢంగా నిద్రపట్టడంలో మరియు మెరుగుపరచడంలో సహాయం చేస్తుంది.

అయితే చాలామందికి నిద్ర పోయేటప్పుడు మధ్యలో మెలకువ వస్తుంది. నిద్ర మధ్యలో ఒకట్రెండు సార్లు లేచి, మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. అయితే రోజూ ఒకే టైంకి మెలకువ వస్తుందంటే.. శరీరంలో ఏదో తేడా ఉన్నట్టేనని అంటున్నారు డాక్టర్లు.

Also Read:CM KCR:నిమ్స్‌కు శంకుస్థాపన

సాధారణంగా 90 శాతం ప్రజలు 9–11 తొమ్మిది నుంచి పది గంటల మధ్యలోనే చాలామంది నిద్రలోకి జారుకుంటారు. అయితే కొంతమందికి ఇలా పడుకోగానే అలా మెలకువ వస్తుంది. తొమ్మిదింటికి పడుకుంటే పదకొండు లోపే మెలకువ వచ్చి, సరిగా నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారు. 11 గంటలలోపు మెలకువ వచ్చిందంటే.. మెదడు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు లెక్క. వీరికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఉంది.

రాత్రి 11 గంటల నుంచి ఒంటి గంట మధ్యలో గాల్ బ్లాడర్ (పిత్తాశయం) శరీరంలోని ఫ్యాట్స్‌‌ని కరిగిస్తుంది. గాల్ బ్లాడర్ నుంచి రిలీజ్ అయ్యే పైత్యరసం చిన్న పేగుల్లోకి వెళ్లి, ఆహారం జీర్ణం అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులోని ఎంజైమ్స్, కొవ్వు పదార్థాలను జీర్ణం చేసి, వాటి ద్వారా అందే ఏ, డీ, ఈ, కె విటమిన్లను శరీరానికి అందిస్తాయి. ఈ సమయంలో నిద్ర ఇబ్బందిగా మారిందంటే.. గాల్ బ్లాడర్ పని తీరు సరిగా లేదని అర్ధం.

Also Read:తెలంగాణ యాసకు కేరాఫ్ ‘శకుంతల’

ఒంటి గంట నుంచి మూడు గంటల మధ్యలో లివర్ యాక్టివ్‌‌గా ఉంటుంది. శరీరంలోని మలినాలను క్లీన్ చేసి, బ్లడ్ ను ప్యూరిఫై చేస్తుంది. ఈ టైంలో మెలకువ వచ్చిందంటే.. లివర్‌‌‌‌లో ఏదో ప్రాబ్లమ్‌‌ ఉందని అర్ధం. రాత్రిళ్లు ఎక్కువగా ఫ్యాట్ ఫుడ్స్ తిన్నా, ఆల్కహాల్ తాగినా ఇలా జరుగుతుంది.

3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఊపిరితిత్తులు ఆక్సిజన్‌‌ను ఎక్కువగా పంప్ చేస్తాయి. కండరాలకు రక్తం, ఆక్సిజన్ అందే సమయం ఇదే. ఈ సమయంలో మెలకువ వస్తోందంటే లంగ్స్‌‌లో సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అందుకే ఇలాంటి వాళ్లు రెగ్యులర్‌‌‌‌గా బ్రీతింగ్ ఎక్సర్‌‌‌‌సైజులు, కార్డియో వ్యాయామాలు చేయాలి.

5 నుంచి 7 గంటల మధ్యలో శరీరం టాక్సిన్స్‌‌ని బయటకు పంపుతుంది. శరీరం మొత్తాన్ని క్లీన్ చేసే టైం ఇది. అందుకే ఈ టైంలో మెలకువ వస్తే వెంటనే లేవడం మంచిది. లేచి కాలకృత్యాలు తీర్చుకుంటే.. హెల్దీగా, ఫ్రెష్‌‌గా రోజుని స్టార్ట్ చేయడానికి శరీరం రెడీ అవుతుంది.6 నుంచి 8 గంటల నిద్ర ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.

- Advertisement -