విజయ్ దేవరకొండ హీరోగా నటించిన టాక్సీవాలా మూవీ సక్సెస్ టాక్ లో దూసుకెళ్లోంది. నోటా సినిమా ప్లాప్ తర్వాత ఈసినిమా విజయ్ కి భారీ విజయాన్ని తెట్టి పెట్టింది. కలెక్షన్ల పరంగా కూడా ట్యాక్సీవాలా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈచిత్రాన్ని కొత్త దర్శకుడు రాహుల్ సంస్కృత్యాన్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ప్రియాంక జువాల్కర్ విజయ్ సరసన నటించింది. గీతా ఆర్ట్స్ 2 మరియు యూవీ క్రియేషన్స్ సంస్ధ వారు సంయుక్తంగా ఈసినిమాను నిర్మించారు.
ఈ చిత్రం ఆడియో వేదికకు గెస్ట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా సక్సెస్ టాక్ తో దూసుకెళ్తుడటంతో అల్లు అర్జున్ ట్యాక్సీవాలా చిత్ర యూనిట్ కు బీ డబ్స్ లో పార్టీ ఇచ్చారు. ఈసందర్భంగా జరిగిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు రాహుల్ సంస్కృత్యాన్. పార్టీ మధ్యలో అల్లు అర్జున్ తనకు పక్కకు పిలిచి సారీ చెప్పారు. ఎందుకు చెప్పారు సార్ అని నేను బన్నీ ని అడిగాడు.
అప్పుడు ఆయన ఆడియో ఫంక్షన్లో నేను ని గురించి చెప్పడం మర్చిపోయాను అని చెప్పారు. ఫరవాలేదు లెండి… నేను కొత్త… నా వర్క్‌ను మీరు చూడలేదు కదా అన్నాను. ‘తెలిసినా తెలియకపోయినా.. చూసినా చూడకపోయినా స్టేజ్ పై నేను మీ గురించి మాట్లాడాలి .. ఎందుకంటే డైరెక్టర్ అనేది గౌరవప్రదమైన పొజిషన్. అలాంటి మీ గురించి స్టేజ్ పై మాట్లాడటం మరిచిపోయాను. ఐయామ్ వెరీ సారీ’ అన్నారు. బన్నీ నాతో ఇలా మట్లాడటం ఆయన గొప్పతనం అని చెప్పారు దర్శకుడు రాహుల్ సంస్కృత్యాన్.