అభిమానుల ఉత్కంఠకు తెరపడింది. మెగా అభిమానులు రొమ్ము విరిచి చెప్పే సినిమా వచ్చేసింది. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మించిన చిత్రం సైరా. గాంధీ జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీతో చిరు మారోసారి మ్యాజిక్ చేశాడని ప్రివ్యూ చూసిన వారు ట్విట్ చేస్తున్నారు.
సైరా సినిమాకి అంతటా పాజిటివ్ టాక్ వినిపిస్తోండగా సినిమా చూసిన వారు ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అద్భుతమైన నటీనటులు, రోమాలు నిక్కబొడిచే డైలాగులు అందరిని అలరిస్తాయని ట్వీట్ చేస్తున్నారు.
మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్లే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్, యుద్ధ సన్నివేశాలు ఇలా సినిమాలో అన్నీ బాగున్నాయని మరికొంతమంది ట్వీట్ చేస్తున్నారు. సినిమాకు ప్రధాన ఆకర్షణ చిరంజీవి నటన , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో ఆయన జీవించేశారని కొనియాడుతున్నారు. నయనతార, తమన్నా సైతం సినిమాకు ప్లస్ అయ్యారట. మెగా అభిమానిని అయినందుకు గర్వంగా ఉందని…బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అని ట్వీట్లు చేస్తున్నారు.