సంవత్సరం పూర్తి చేసుకున్న సైరా..

206
syera
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా నేటితో యేడాది పూర్తి చేసుకుంది. సరిగ్గా యేడాది క్రితం 2019 గాంధీ జయంతి రోజున విడుదలైన చిరంజీవి తొలి చారిత్రక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.ఈ చిత్రంలో చిరంజీవి తొలిసారి చారిత్రక యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించారు. హీరోగా చిరంజీవి తొలి ప్యాన్ ఇండియా మూవీ ఇది. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ చేసారు. రామ్ చరణ్ నిర్మాతగా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ఆధారంగా నిర్మించారు.

Sye Raa

ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి, నయన తార, అనుష్క శెట్టి, తమన్నా, రవి కిషన్, నీహారిక కొణిదెల త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషించారు. అమిత్ త్రివేది సంగీతం అందించారు. సైరా సినిమాలో తెరపై చిరంజీవి, అమితాబ్, త‌మ‌న్నా ఎంత‌గానో అల‌రించ‌గా తెరవెనుక ఉన్న హీరోలు డైలాగ్ రైటర్ సాయిమాధవ్ బుర్రా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, మ్యూజిక్ డైరెక్టర్ అమిత్ త్రివేది ఈ సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ్లారు.

- Advertisement -