మొక్కలు నాటిన గజ్జల సూర్య ప్రకాష్..

99
Planted Saplings

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా, గాంధీ జయంతి పురస్కిరించుకొని అర్చమెడిస్ గ్రీన్ పవర్ ఎనర్జీ ప్రవైట్ లిమిటెడ్ కంపెనీ సిఈఓ గజ్జల సూర్య ప్రకాష్ మొక్కలు నాటారు. జెఎన్‌టియు మాజీ వైస్ ఛాన్సలర్ విసిరినా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి ఆయన మొక్కలు నాటినట్లు తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీ జయంతి సందర్బంగా మొక్కలు నాటడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అవడం ఆనందంగా ఉంది అని, కేసీఆర్ చేపట్టిన హరితహారం చాల మంచి కార్యక్రమం,దీనికి మద్దతుగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనతికాలంలో మంచి ప్రజాదరణ పొందింది. పర్యావరణ పరిరక్షణకోసం, వాతావరణ సమత్యులత కోసం మొక్కలు నాటడం మన బాధ్యత అన్నారు. ఈ ఉద్యమం ఇలానే కొనసాగాలని మరో ముగ్గురికి వారేవా షెఫ్ సంజయ్ తుమ్మల, అంబటి రాయుడు క్రికెటర్, పివి సింధు టెన్నిస్ క్రీడాకారినికి ఛాలెంజ్ చేశారు.