జగన్‌ అలా చేస్తే సహించను:స్వరూపానందేంద్ర స్వామి

322
Jagan swarupanandendra

జగన్ నిజాయితీ పరుడు,అబద్దాలు ఆడటం తెలియదన్నారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి. ఈ సమాజంలో తన పేరు మర్చిపోకూడదు..తన తండ్రికి ఎంత గుర్తింపు వచ్చిందో అంతకంటే ఎక్కువ గుర్తింపు ఉండాలనే కసి ఉన్న మనిషని కితాబిచ్చారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

జగన్‌కు ఏమీ చెప్పినా వింటారని.. వాటిని సమీక్షించుకుంటారని చెప్పుకొచ్చారు. జగన్ ఏ పని చేసినా శారదా పీఠం ముహూర్తం పెడుతుందన్నారు. పాదయాత్ర నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నిటికి శారదా పీఠం ముహూర్తం నిర్ణయించిందని చెప్పుకొచ్చారు.

గత ప్రభుత్వంలో ఇసుక మాఫియాతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని తెలిపిన స్వరూపానందేంద్ర దేవాలయాల భూములను పరిరక్షించాలని జగన్‌కు సూచించారు. అర్చకుల్ని ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలని వారి దీవెనలే శ్రీరామ రక్షగా అభిప్రాయపడ్డారు. రాజశేఖర్‌రెడ్డి కంటే జగన్‌ గొప్పగా పరిపాలించి మంచి నాయకుడిగా ఎదుగుతారని తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. చంద్రబాబు హయాంలో జరిగినట్లుగా దేవాలయాలను కూల్చి.. దేవాలయాల ఆస్తుల్ని పూర్తిగా కొల్లగొట్టి.. టీటీడీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తే జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వమైనా నిలదీస్తానని స్పష్టం చేశారు.