కేసీఆర్ క్యాబినెట్లో మిగిలిన 6గురు మంత్రులు వీళ్లే?

319
cm kcr

తెలంగాణలో గత డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రెండవ సారి ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. తొలుత సీఎం కేసీఆర్ తో పాటు హోం మంత్రి మహ్ముద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. ఇద్దరు మంత్రులతోనే రెండు నెలల పాటు పరిపాలన చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు 10మందితో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించారు. ఇంకా ఆరుగురు మంత్రులను పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రకటించనున్నట్లు తెలిపారు. ఇటివలే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలవడటంతో త్వరలోనే కేబినెల్ విస్తరణ ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. చాల మంది మంత్రిపదవుల కోసం ఎదురుచూస్తున్నారు.

వారిలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావుకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బెర్త్ ఖరారైనట్లు తెలుస్తుంది. ఇక మరోకటి ఖమ్మం జిల్లాకు వరించనుంది. గత ఎన్నికల్లో టీడీపీ లో గెలిచి ఆ ఆపార్టీకి రాజీనామా చేసిన సండ్ర వెంకటవీరయ్యకు మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఇక మరో మంత్రి పదవి నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరో రెండు మహిళలకు ఇవ్వనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు సీఎం కేసీఆర్.

ఆరెండిట్లో ఒకటి రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వగా మరోకటి ఎస్టీ సామాజిక వర్గానికి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో సబితా ఇంద్రారెడ్డికి మంత్రి పదవి ఖరారైనట్లు సమాచారం. ఇక ఎస్టీ కోటా నుంచి ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ లేదా ఇటివలే ఎమ్మెల్సీగా ఎన్నికైన సత్యవతి రాథోద్ కు అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరో వారం రోజుల్లో పూర్తి స్ధాయి మంత్రివర్గ విస్తరణ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తుంది.