యువతను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతోంది..

286
Chandrasekhar
- Advertisement -

యువతలో చైతన్యం తీసుకొచ్చి ఉత్తమ పౌరులుగా తయారు చేసే లక్ష్యంగా స్వర్ణ భారత్ కృషి చేస్తోందన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. సజామానికి సేవ చేయాలన్నదే స్వర్ణ భారత్ ట్రస్టు లక్ష్యమని ఆయన అభినందించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూతురు దీపా నిర్వహిస్తున్న స్వర్ణ భారత్ ట్రస్టు శాఖను ప్రారంభించిన సీఎం ట్రస్టు మరింత విజయవంతం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉందని సీఎం చెప్పారు.

 Chandrasekhar

గాంధీజి సిద్ధాంతాలతో నడుస్తున్న ఈ ట్రస్టు యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. గ్రామీణులను శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి ఉపాధి కల్పించడం  ప్రశంసనీయమన్నారు. పట్టణాలకు వలస వెళ్లినవారు గ్రామాలకు తిరిగి రావాలనే లక్ష్యంతో స్వర్ణ భారత్ ట్రస్టు కృషి చేస్తోందన్నారు. స్థానిక స్వపరిపాలన అద్భుతంగా ఉంటేనే దేశ వికాసం సాధ్యమన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అభివృద్ధి కోసం ప్రభుత్వపర సాయం అందిస్తామన్నారు. మంచి కార్యక్రమాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండదండగా ఉంటుందన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు

- Advertisement -