ఖైదీ థ్యాంక్యూ మీట్‌….

157
Thank You' Meet For Khaidi

మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఖైదీనెంబర్‌ 150 బాక్స్‌ఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇద్దరు ఆగ్రహీరోలు నటించిన సినిమాలు ఒకరోజు తేడాతో విడుదలైన కూడా రెండిటి కలెక్షన్లు భాగానే ఉన్నాయి. తొమ్మిద సంవత్సరాల తర్వాత బాస్‌ఈజ్‌బ్యాక్‌ అంటూ మెగా అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. సుదీర్ఘకాలం తర్వాత వెండితెరపై కనిపించిన చిరంజీవి ఏమాత్రం తేడా రాకుండా ఆదే స్ధాయిలో నటించాడు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు అంటూ దుమ్ముదులిపేశాడు… 60సంవత్సరాల వయస్సులో కూడా మెగాస్టార్‌ ఇలాంటి డాన్స్‌ చేయడం ఆయన స్టామినాకి నిదర్శనం అని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Thank You' Meet For Khaidi

ఇటీవలే ఖైదీనెంబర్‌150 రిలీజ్‌కు ముందు ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌ గుంటూరులోని హ్యాయ్ లాండ్‌లో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు థ్యాంక్యూ మీట్‌ పేరుతో ఖైదీకోసం మరో మెగా ఈవెంట్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు ఫిల్మ్‌నగర్‌లో వార్తలు జోరదుకున్నాయి. ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు ఏమాత్రం తగ్గకుండా… థ్యాంక్యూ మీట్‌ను గ్రౌండ్‌గా చేయాలని రాంచరణ్‌ భావిస్తున్నాడట. ఈ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఈమెగా ఈవెంట్‌ కోసం అల్లు అరవింద్‌ ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారట. సినిమాను విజయవంతం చేసిన సినీ ప్రేక్షకులకు,మెగా అభిమానులకు కృతజ్ఞతలు చెప్పడమే థ్యాంక్యూ మీట్‌ ఉద్దేశం అని తెలుస్తోంది .

Thank You' Meet For Khaidi

అయితే ఈ థ్యాంక్యూ మీట్‌కు పవన్‌ కళ్యాన్‌ను తప్పనిసరిగా తీసుకురావాలని యోచిస్తున్నారట. ఇటీవలే జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు పవన్‌ రాకపోవడపై ఎన్నో విమర్శలకు దారితీసింది. ఈసారి అలా కాకుండా పవన్‌ తప్పకుండా హాజరైయ్యేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటుందట మెగాఫ్యామిలీ. మరీ ఈసారి నిర్వహించే థ్యాంక్యూ మీట్‌ ఈవెంట్‌కు పవన్ వస్తాడో రాడో వేచిచూడాల్సిందే మరి.