ఖైదీపై పైరసీ పంజా..!

168
Khaidi No 150 Movie on social media
- Advertisement -

మెగా స్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ నంబర్ 150 బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది. తొలి రోజు 47.07 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించి చిరు తన స్టామినా ఏంటో చూపించాడు. అయితే చిరంజీవికి పైరసీ రూపంలో అనుకోని షాక్ ఎదురైంది. విడుదల అయినా తొలి రోజే ఈ చిత్రానికి సంబందించిన పైరసీ హల్ చల్ చేసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలో దిగారు. ఖైదీ చిత్రాన్ని ఆన్ లైన్ లో విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు.

నల్గొండ లో ఓ వ్యక్తి ఈ చిత్రాన్ని పైరసీ చేసి.. ఇతరులకు అమ్ముతున్నాడు. ఇప్పటికే ఈ పైరసీ తెలుగు రాష్ట్రాల నలుమూలకు చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో చిత్రయూనిట్ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు ఖైదీ పైరసి బయటకు రావడంతో చిత్ర కలెక్షన్ లపై ప్రభావం చూపిస్తుందేమో అని చిత్ర టీం ఆందోళనలో ఉంది. నిజానికి ఓపెనింగ్ డే మార్నింగ్ షో ప్రదర్శిస్తుండగానే సినిమాకు సంబంధించిన పాటలు, సన్నివేశాలు వాట్సప్ లో చక్కర్లు కొట్టాయి. దీనిపై అప్పుడే చర్యలు తీసుకుంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదని ఫిల్మ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -