సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ ఇకలేరు…

76
swamy agnivesh

ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌ (80) ఇకలేరు. కొంతకాలంగా కాలేయ సమస్యతో ఢిల్లీలోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ బిలియరీ సైన్సెస్‌ (ఐఎల్‌బీఎస్‌)లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ సాయంత్రం మృతిచెందారు.

1939, సెప్టెంబర్‌ 21న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు స్వామి అగ్నివేష్. నాలుగేళ్ల వయసులోనే తండ్రిని కోల్పోయిన ఆయన తాత వద్ద పెరిగారు. కోల్‌కతాలోని సెయింట్ జేవియర్స్ కళాశాలలో చదువుకుని అక్కడే అధ్యాపకుడిగా ఉద్యోగం చేశారు. తర్వాత లాయర్‌గా ప్రాక్టీస్ చేసిన ఆయన సామాజిక సమస్యలపై పోరాడేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు.

హర్యానా నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన మంత్రికూడా పనిచేశారు. పర్యావరణ సమస్యలు, బాలల వెట్టిచాకిరిపై పోరాటం, ప్రాంతీయ ఉద్యమాలు నిర్వహించి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు.