స్వామి అగ్నివేష్ మృతి బాధాకరం: ఆర్య ప్రతినిధి సభ

69
Swami Agnivesh

ఆధ్యాత్మిక,సామాజిక వేత్త ఆర్య సమాజ నాయకులు స్వామి అగ్నివేశ్ మృతిపట్ల సంతాపాన్ని వ్యక్తం చేసింది ఆర్య ప్రతినిధి సభ. జీవితాంతం ప్రజల సమస్యలపై అహర్నిశలు అగ్నివేశ్ కృషిచేశారని…తెలుగువాడైన అగ్నివేశ్ గారు ఎన్నో జాతీయ ,అంతర్జాతీయ అవార్డ్స్ పొందారని తెలిపింది.

సతి యాక్ట్ ,బంధు ముక్తి మోర్చా ,బాలల హక్కులు,భేటి బచావో భేటి పడావో ఆయన చేసిన ఉద్యమం లో నుండి పుట్టినవే..వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తు వారి మరణం ప్రపంచానికి తీవ్ర మనోవేదనకు కలిగిస్తున్నది.తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం అని ఆర్య ప్రతినిధి సభ ప్రధాన కార్యదర్శి వెంకటరాములు తెలిపారు.