తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ, వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలు దాటించిన వ్యక్తి స్వామి వివేకానంద . అమెరికా,ఇంగ్లాండులో ఆయన ప్రసంగాలు భారత సమాజం గొప్పగా చెప్పుకుంటుంది. పాశ్చాత్య దేశాల్లో అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి. అందుకే వివేకానంద జన్మదినాన్ని ‘జాతీయ యువజన దినోత్సవం’గా జరుపుతోంది.
అందుకే క్షణం తీరికలేని ఓ అమెరికా వ్యాపార వేత్తకి జీవితం అంటే ఏమిటో రెండు ముక్కల్లో చెప్పారు స్వామి వివేకానంద. అమెరికాలో జరిగిన మత సమ్మేళనంలో పాల్గొన్నారు స్వామి వివేకానంద. ఆయన చేసిన ప్రసంగం సంచలనం సృష్టించింది. స్వామి వివేకానంద ప్రసంగం అప్పట్లో అన్ని వార్త పత్రికల్లో ప్రధానంగా ప్రచురించారు. అవన్ని చూసిన అమెరికాలోని ఒక పెద్ద వ్యాపారవేత్త స్వామి వివేకానందని కలవాలనుకున్నారు. స్వామిజి క్షణం తీరిక లేకుండా ఉన్పప్పటికి తన పరపతిని ఉపయోగించి అపాయింట్‌మెంట్ సంపాదించారు.
అనుకున్న సమయానికి ఆ వ్యాపారవేత్త స్వామిజీ ఉన్న ప్రత్యేక గదిలోకి ప్రవేశించారు. స్వామి నేను క్షణం తీరిక లేని వ్యాపారవేత్తను, నాలో ఆధ్యాత్మిక భావన కూడాఎక్కువే. కానీ నాకున్న సమయం మాత్రం చాలా తక్కువ. అందుకని వేదాలు, ఉపనిశత్తులు చదవమని కానీ సాధువుల ప్రసంగాలు వినమని కానీ యోగా, ధ్యానాలు చేయమని కానీ దయచేసి నాకు చెప్పొద్దు.
ఒకటి, రెండు మాటల్లోనే జ్ఞానం ప్రసాదించే మోక్షమార్గాన్ని చెప్పాలని కోరారు. నిజంగా మీరు ఒకటి రెండు మాటల్లో చెప్పగలిగితే ఓకే అనండి లేదంటే వెళ్లిపోతానని చెప్పారు. ఎందుకంటే నాకు మీవద్ద ఎక్కువ గంటలు గడిపే సమయం లేదన్నారు. ఆ మాటలు విన్న వివేకానంద మీరు ఆశీంచినట్లే ఒకటి రెండు మాటల్లోనే మీకు జ్ఞానం కలిగేలా చేస్తానని తెలిపారు.
వేదాలు, ఉపనిశత్తులు ఏమీ చదవనక్కర్లేదు, స్వామిజీల ప్రసాంగాలు వినక్కర్లేదు. యోగా,ధ్యానాలు ఏమి చేయొద్దు అన్నారు. ఆ మాటలు వినగానే వ్యాపారి మొఖంలో సంతోషం వెల్లివిరిసింది. మరి నన్ను ఏమి చేయమంటారు స్వామిజీ అన్నారు వ్యాపారి. రోజుకోసారి మీరు మీ మరణాన్ని గుర్తుచేసుకోండి చాలు జ్ఞానశక్తి కలుగుతుంది ఇక నేను చెప్పాల్సింది అయిపోయింది మీరు బయలుదేరవచ్చు అని తెలిపారు స్వామి వివేకానంద. ఆ మాటల్లోని అంతసారం ఏమిటో ఆ వ్యాపారికి చక్కగా అర్ధం అయిపోయింది. అతని మనసు సంభ్రమాశ్చార్యాలతో నిండిపోయింది. ప్రతీ రోజు మరణాన్ని గుర్తుచేసుకోవడం అంటే జీవితం చాలా చిన్నది అని అర్ధం. ఇంత చిన్న జీవితంలో సుష్కమైన, హీన కార్యకలాపాలకు తావులేకుండా ఉన్నతమైన ఆలోచనలతో ఉత్కృష్టమైన జీవితాన్ని సాగించాలన్న సంకల్పానికి రావడమే.
స్వామిజీ మాటల్లోని సత్యం ఆ వ్యాపారికి చక్కగా అర్థం అయిపోయింది.వెంటనే లేచి స్వామిజీకి సాష్టంగా నమస్కారం చేసి నిండు ఆనందంతో వెళ్లిపోయారు. నిజమే కదా జీవితం చాలా చిన్నది కదు అందుకే సాధ్యమైనంత వరకు మంచిని చేద్దాం, మంచిని పెంచుదాం,మంచిని పంచుదాం, పోయేదేముంది.
Also Read:అబద్ధాల ముందు ‘అభివృద్ధి డీలా’ !