తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు..

25

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. ఇవాళ ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కే.లక్ష్మణ్, వైసీపి ఎంపీ గోరంట్ల మాధవ్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ దేవిరెడ్డి శ్రీనాధ్ రెడ్డి, స్వామీ‌ పరిపూర్ణానంద, బిజేపి నేత సునీల్ ధియోధర్ లు వైకుంఠ ద్వార దర్శనం గుండా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం ఆలయ వెలుపలకు‌ వచ్చిన పరిపూర్ణానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ.. ఒమిక్రాన్ నివారణకు స్వామి వారి అనుగ్రహం ఒక్కటే నివారణ అని, ప్రపంచం కొట్టు మిట్టాడితున్న సమస్య ‌ఒక్కటే ఓమిక్రాన్ అన్నారు.

ఓమిక్రాన్ వ్యాధి వ్యాప్తి పూర్తిగా అంతం కావాలని స్వామి వారిని‌ ప్రార్ధించినట్లు తెలిపారు.. ఒమిక్రాన్ పట్ల పెద్దలు,పిల్లలు‌ జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు..అనంతరం బిజేపి నేత సునీల్ ధియోధర్ మీడియాతో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి, సంక్రాతి శుభాకాంక్షలు సునిల్ దియోధర్ తెలిపారు.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు టిటిడి‌ చక్కటి ఏర్పాట్లు చేసిందని ఆయన టిటిడిని కొనియాడారు.. ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్యాపిటల్ తిరుమల క్షేత్రం అని,‌ కరోనా మూడోవ సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. నిన్నటి రోజు మూడు కోట్ల పైగా వ్యాక్సినేషన్ పూర్తి చేసిందన్నారు.. యావత్తు ప్రజానీకానికి మంచి‌ బుద్దిని ప్రసాదించాలని స్వామిని వేడుకున్నట్లు ఆయన తెలిపారు.