రామ్ చరణ్- శంకర్ మూవీకి రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌..

24

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో సినిమా ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే కదా. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నిదిల్ రాజు భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు. తాజాగా ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు రిలీజ్‌కు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

వచ్చే ఏడాది ఇదే సమయానికి అంటే.. 2023, జనవరి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు కన్‌ఫర్మ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఆయన సంస్థలో 50వ చిత్రంగా నిర్మితమవుతోంది. అందుకే ఏమాత్రం బడ్జెట్‌కు వెనకాడకుండా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో భారీగా నిర్మితమవుతోన్న ఈ సినిమా రూ. 200 కోట్ల బడ్జెట్‌తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ అనుకుంటున్నారు.