Gas:స్వల్ఫంగా తగ్గిన కమర్షియల్‌ సిలిండర్‌.!

31
- Advertisement -

దేశవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్‌ ధరలను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ప్రతి నెల ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధరలను సమీక్షిస్తున్న చమురు కంపెనీలు 19కిలోల ఎల్పీజీ సిలిండర్‌ రేటును రూ.91.50మేర తగ్గించాలిని నిర్ణయించాయి. అయితే తగ్గిన ధరలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించాయి. దేశరాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ రూ.2028కి తగ్గింది. ఇక కోల్‌కత్తాలో రూ.2221 నుంచి రూ.2132, ముంబైలో రూ.1980, చెన్నైలో రూ.2176కి తగ్గాయి. అయితే గృహావసరాలకు వినియోగించే డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ యేడాది కమర్షియల్ గ్యాస్‌ సిలిండర్ ధరలు రెండుసార్లు పెరిగాయి. గత నెల మార్చిలో రూ.350, అంతకుముందు జనవరిలో రూ.25 మేరకు పెంచిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి…

Fish Oil:చేపనూనె తీసుకుంటే ఎన్ని ఉపయోగాలో..!

Gold Price:స్థిరంగా పసిడి ధరలు

గుడ్ న్యూస్.. రైల్వే కొత్త నిబంధనలు

- Advertisement -