హైటెక్‌సిటీలో స్వదేశ్‌ రెస్టారెంట్

242
Swadesh Multi Cuisine Restaurant at Kothaguda
- Advertisement -

అద్భుతమైన థీమ్‌ ఆధారిత స్వదేశ్‌ రెస్టారెంట్‌ హైటెక్‌ సిటీ సమీపంలోని కొత్తగూడ సర్కిల్‌లో కొలువుదీరింది. ఈ రెస్టారెంట్‌కి ఎన్నో వినూత్న, విశేషాలు ఉన్నాయి. యువతను ఆకట్టుకునే విభిన్న రకాల అంశాలు, పరిసరాలు దీనికి కొత్త శోభను ఇస్తున్నాయి. రెస్టారెంట్‌ ప్రాంగణంలో పరచుకున్న పచ్చదనం ఆహ్లాదకరమైన అనుభూతిని అతిధులకు అందిస్తుంది. అత్యంత ఆనందదాయకమైన, హృదయాన్ని స్పర్శించే రుచుల ఆస్వాదనను అందిస్తామని స్వదేశ్‌ నిర్వాహకులు తమ అతిధులకు హామీ ఇస్తున్నారు.

రుచులెన్నో…

థీమ్, యాంబియన్స్‌లో మాత్రమే కాకుండా స్వదేశ్‌ రెస్టారెంట్‌ విభిన్న రకాల రుచులను వడ్డించడంలోనూ అతిధుల అభి‘రుచుల’కు పెద్ద పీట వేస్తోంది. ఉత్తరాది, దక్షిణాది ప్రాంతీయ రుచులతో పాటు ప్రత్యేకంగా పేరొందిన హైదరాబాదీ క్యుజిన్‌ అంతేకాకుండా చైనీస్, థాయ్, కాంటినెంటల్‌ క్యుజిన్‌లను కూడా అందిస్తోంది. ఆయా ప్రాంతాలకు చెందిన అసలు సిసలు రుచులను వండి వడ్డించేందుకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా నేపాల్‌ నుంచి కూడా చెఫ్స్‌ ఇక్కడ సేవలు అందిస్తున్నారు. ఎన్నో పరిశోధనల అనంతరం, ఎంతో ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దిన, ఎంపిక చేసిన రుచుల మెనూ, క్రొకరీ, కట్లరీ, ఇంటీరియర్స్‌తో నిర్వాహకులు అతిధుల ఆనందానికి పూర్తిగా హామీ ఇస్తున్నారు. హైదరాబాద్‌ ఐటి హబ్‌కి గుండె లాంటి ప్రదేశంలో 114 సీటింగ్‌ సామర్ధ్యంతో స్వదేశ్‌ మల్టిక్యుజిన్‌ నెలకొంది. ఎస్‌ఎస్‌ఎస్‌ స్క్వేర్‌లో పూర్తి స్థాయి పార్కింగ్‌తో ఉన్న ఈ అద్భుతమైన రెస్టారెంట్‌ను సురభి పురానిక్‌ చేతుల మీదుగా ప్రారంభించారు.

Swadesh Multi Cuisine Restaurant  at Kothaguda

స్వదేశ్‌ మల్టి క్యుజిన్‌ ప్రారంభ సందర్భంగా సురభి పురానిక్‌ మాట్లాడుతూ ‘‘ఈ స్వదేశ్‌ మల్టిక్యుజిన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషిస్తున్నాను. ఈ రెస్టారెంట్‌ థీమ్, అందమైన పరిసరాలు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. తమ కస్టమర్ల మనస్సులను ఈ స్వదేశ్‌ తప్పకుండా ఆకట్టుకుంటుందని, నాణ్యమైన, రుచికరమైన ఫుడ్‌తో ఆదరణ పొందుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ రెస్టారెంట్‌ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అన్నారు.

ఈ సందర్భంగా మేనేజింగ్‌ పార్ట్‌నర్స్‌ సుజీత్‌ సుంకు, ఆంజనేయులు కందుల మాట్లాడుతూ ‘‘ఐటి జాబ్స్‌ వదిలేసి వినూత్న ఆలోచనలతో వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన మాకు ఇది కల సాకారం కావడం లాంటిది. మా రెస్టారెంట్‌కి వచ్చిన కస్టమర్లు అందరికీ ఒక అద్భుతమైన అనుభవాన్ని అందిస్తామని మేం హామీ ఇస్తున్నాం. హైటెక్‌ సిటీ వాసులకు ఈ థీమ్‌ బాగా నచ్చుతుందని మా నమ్మకం. ప్రతి టేబుల్‌ మీదా వారికి నచ్చే వంటకాలను అందించగలమని నమ్ముతున్నాం’’అని అన్నారు.

- Advertisement -