బ్రిట‌న్ హోంశాఖ మంత్రిగా సుయెల్లా బ్రెవ‌ర్మాన్..

145
suyeman
- Advertisement -

బ్రిటన్ హోంశాఖ మంత్రిగా భారత సంతతికి చెందిన న్యాయవాది సుయెల్లా బ్రెవర్మాన్ నియమితులయ్యారు. బ్రిట‌న్ కొత్త ప్ర‌ధానిగా లిజ్ ట్ర‌స్ కొత్త కేబినెట్‌ను విస్త‌రిస్తున్నారు. 42 ఏళ్ల కన్జ‌ర్వేటివ్ పార్టీ నేత అయిన బ్రెవ‌ర్మాన్‌.. గ‌త బోరిస్ ప్ర‌భుత్వంలో అటార్నీ జ‌న‌ర‌ల్‌గా చేశారు. బ్రెవ‌ర్మాన్‌ను హోంశాఖ మంత్రిగా కొత్త ప్ర‌ధాని లిజ్ నియ‌మించారు.

ఆమెకు ఇద్ద‌రు పిల్ల‌లు. కేంబ్రిడ్జ్ యూనివ‌ర్సిటీలో న్యాయ విద్య‌ను అభ్య‌సించారు. 2018లో రాయ‌ల్ బ్రెవ‌ర్మాన్‌ను ఆమె పెళ్లాడారు. కేబినెట్ మంత్రిగా ఉంటూనే ఆమె రెండో పాప‌కు జ‌న్మ‌నిచ్చింది. బ్రెవ‌ర్మాన్ బౌద్ద మ‌తాన్ని స్వీక‌రించారు.

- Advertisement -