ఆరేళ్ళ పాపతో బికినీ డాన్స్‌..

190
- Advertisement -

సుస్మిత సేన్‌…మాజీ మిస్‌ ఇండియా. అందరకీ సోలో ఉమెన్‌గా, మాజీ మిస్ ఇండియాగా  సుపరిచితమైన ఈ అమ్మడు ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. సినిమాలు వ‌దిలేసి ఫ్యాష‌న్ ప్ర‌పంచంలో త‌న హ‌వా చూపిస్తుంది ఈ బ్యూటీ. అయితే ప్ర‌స్తుతం ముంబై కేంద్రంగా మోడ‌ల్స్‌కి ట్రైనింగ్ ఇస్తూ శ‌భాష్ అనిపించుకుంటోంది కూడా. అంతేకాకుండా ఇటీవ‌లే తెలంగాణ‌కు చెందిన ఓ తెలుగ‌మ్మాయిని ఫ్యాష‌న్ ఐకాన్‌గా తీర్చిదిద్ది ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసింది.
  Sushmita Sen dances with daughter Alisah to Ed Sheeran's Shape of
అయితే సుస్మిత చేసిన ఓ పని వల్ల  సోషల్‌ మీడియా మొత్తం ఆ విషయం గురించే చర్చిస్తోంది. అసలు సుస్మిత చేసిన ఆ పని ఏంటి అనుకుంటున్నారా? ఈ బ్యూటీ పిల్ల‌ల్ని ద‌త్త‌త తీసుకుని మ‌మ్మీ అయ్యింద‌న్న మ్యాటర్‌ అందరికీ తెలిసిందే. అయితే.. ఆరేళ్ల‌ తన చిన్నపాప అలీసా తో కలిసి స్విమ్ షూట్‌లో డ్యాన్స్‌ చేసింది సుస్మిత.
Sushmita Sen dances with daughter Alisah to Ed Sheeran's Shape of
స్విమ్మింగ్ పూల్ చెంత డ్యాన్సాడుతున్న ఆ ఫోటోల్ని  సోషల్‌ మీడియలో అభిమానుల‌కు షేర్ చేసింది సుస్మిత. ఇంకేముందీ…ఇక ఈ ఫోటోలు సోషల్‌ మీడియా లో ఓ రేంజులో వైర‌ల్ మారాయి. ఇప్పుడు అందరూ ఈ ఫోటోల గురించి చర్చించుకోవడం విశేషం. ఏదేమైనా..మ‌న‌సుండాలే కానీ.. వ‌య‌సు దేనికీ అడ్డంకి కాదు అని నిరూపించింది ఈ బ్యూటీ.

- Advertisement -