నేపాల్‌ తాత్కాలిక ప్రధానిగా సుశీల!

5
- Advertisement -

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల పేరును ప్రతిపాదించారు జెన్‌ జడ్ నేతలు. ఆ దేశ మాజీ చీఫ్‌ జస్టిస్‌ సుశీల కార్కీ(73)ని వర్చువల్‌ సమావేశంలో ఖరారు చేశారు. అలాగే కాఠ్మాండు మేయర్‌ బాలేంద్ర షా, మాజీ విద్యుత్‌ బోర్డు అధికారి కుల్మాన్‌ ఘిసింగ్‌ పేర్లను కూడా పరిశీలించారు.

విద్యార్థుల నిరసనల మధ్య మంగళవారం ప్రధాని పదవికి కేపీ శర్మ ఓలి రాజీనామా చేయడంతో నేపాల్‌ తీవ్ర రాజకీయ సంక్షోభంలోకి దిగజారింది. నిరసనల కారణంగా చట్టం, శాంతి భద్రతల బాధ్యతలను నేపాల్‌ ఆర్మీ స్వీకరించి బుధవారం దేశవ్యాప్తంగా ఆంక్షలు, కర్ఫ్యూ విధించింది.

సుశీల కార్కీ నేపాల్‌ తొలి మహిళా చీఫ్‌ జస్టిస్‌గా చరిత్ర సృష్టించారు. 2016 జూలై నుంచి 2017 జూన్‌ వరకు ఆమె సేవలందించారు. ఆమె పదవీకాలంలో అవినీతిపై జీరో టోలెరన్స్‌ విధానాన్ని అవలంబించారు.

Also Read:భారత్‌ – పాక్ మ్యాచ్ రద్దుపై సుప్రీం

- Advertisement -