మళ్లీ తెరపైకి శ్రీవారి పింక్ డైమండ్!

9
- Advertisement -

మరోసారి తెరపైకి తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ వ్యవహారం వచ్చింది. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు సమర్పించినది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు రాయి మాత్రమేనని తెలిపింది ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా.

ఆ హారంలో రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే ఉన్నాయని సమాచారం. పింక్ డైమండ్ ప్రచారం అబద్ధమని పలు ఆధారాలతో నిరూపించారు ఆర్కియాలజీ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి.

2018లో శ్రీవారి పింక్ డైమండ్ మాయమైందని ఆరోపించారు ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు. దీనిపై ASI లోతుగా పరిశోధన చేయగా.. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం అది కెంపు రాయి మాత్రమేనని స్పష్టం చేశారు.

Also Read:12న ఉపరాష్ట్రపతి ప్రమాణస్వీకారం

- Advertisement -