సుశాంత్‌ను చంపింది రియానే: కేకే సింగ్

188
sushanth

తన కుమారుడు సుశాంత్‌ను చంపింది రియా చక్రవర్తేనని మరోసారి ఆరోపించారు కేకే సింగ్. రియా తన కుమారుడికి విషం ఇచ్చి చంపేసినట్లు తెలిపారు. ఈ కేసును ఇప్పటికే సీబీఐ విచారిస్తుండగా కేసు కూడా నమోదుచేసింది సీబీఐ.

రియానే త‌న కుమారుడిని హ‌త్య చేసింద‌ని, ఈ కేసులో రియాను, ఆమెకు స‌హ‌క‌రించిన‌వారిని అరెస్టు చేయాల‌ని కృష్ణ‌కుమార్ సింగ్ డిమాండ్ చేశారు. ముంబైలో ఉన్న సీబీఐ అధికారులు గ‌త కొన్ని రోజుల నుంచి సాక్ష్యుల‌ను విచారిస్తున్నారు.

ఇప్పటికే రియాకు సమన్లు జారీచేసిన సీబీఐ ఆమెకు ముంబైలో డ్ర‌గ్ డీల‌ర్ల‌తో ఉన్న లింకుపై విచారించనున్నారు.జూన్ 14వ తేదీన సుశాంత్ ముంబైలోని త‌న నివాసంలో మృతిచెందిన విష‌యం తెలిసిందే.