సూర్యకుమార్ చెత్త రికార్డు..

35
- Advertisement -

ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత్ ఓటమి పాలైంది. కీలకమైన మూడో మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్ 21 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ని 2-1 తేడాతో గెలుచుకుంది. ఇక ఈ సిరీస్‌లో చెత్త రికార్డు నెలకొల్పాడు భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్.

చివరి వన్డేలో నెం.7లో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్ బాల్‌కే బౌల్డ్ అయి గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. తొలి రెండు వన్డేల్లో ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కే ఎల్బీడబ్ల్యూగా ఔటైన సూర్యకుమార్ యాదవ్.. చెపాక్‌లో మాత్రం స్పిన్నర్ అస్టన్ అగర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.వరుసగా మూడు డకౌట్‌లతో చెత్త రికార్డు నెలకొల్పాడు.

కీలక టైంలో క్రీజులోకి వచ్చిన సూర్య..ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. దీంతో సూర్యపై నెటిజన్లు సెటైర్లు, ట్రోలింగ్ మొదలుపెట్టారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -