జాతిరత్నాలు హీరోయిన్ తో నరేష్

13
- Advertisement -

అల్లరి నరేష్ అప్ కమింగ్ మూవీ “ఉగ్రం”. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. తాజాగా ఉగాది శుభ సందర్భంగా మరో సినిమాను ప్రారంభించారు. అల్లరి నరేష్ కొత్త సినిమా ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నూతన దర్శకుడు మల్లి అంకం దర్శకత్వం వహించనున్నారు. రాజీవ్ చిలక నిర్మించనున్నారు.

జాతిరత్నాలు ఫేమ్ ఫరియా అబ్దుల్లా నరేష్ కి హీరోయిన్ గా నటిస్తుంది. నరేష్ ఫరియ కాంబోలో మొదటి సినిమా ఇది. ఈ సినిమా ఈరోజు అధికారికంగా లాంచ్ అయింది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది. అబ్బూరి రవి డైలాగ్స్ రాయనుండగా, గోపి సుందర్ సంగీతం సమకూర్చనున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి…

అన్నీ మంచి శకునములే టైటిల్‌ ట్రాక్ లాంచ్‌..

అన్నీ మంచి శకునములే టైటిల్‌ ట్రాక్ లాంచ్‌...

నిజాయితీగా పనిచేశా: విశ్వక్‌సేన్‌

- Advertisement -