బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్..

30
- Advertisement -

పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గి రూ.54,200కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 పడిపోయి రూ.59,130గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.800 తగ్గి రూ.54,350కి చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.870 తగ్గి రూ.59,280కి చేరింది.

బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర తాజాగా రూ.500 తగ్గి రూ.71,600గా ఉండగా హైదరాబాద్‌లో కేజీపై రూ.700 తగ్గి ప్రస్తుతం విలువ రూ.74 వేల వద్ద స్థిరంగా ఉంది. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు పడిపోయాయి.

ఇవి కూడా చదవండి..

- Advertisement -