కుమారి 21ఎఫ్‌ దర్శకుడితో నిఖిల్..!

135
nikhil

అర్జున్ సురవరం సినిమాతో హిట్ సొంతం చేసుకున్న నిఖిల్ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కుమారి 21 ఎఫ్‌ సినిమా దర్శకుడు సూర్యప్రతాప్‌తో సినిమా చేయనున్నాడు. రేపు(గురువారం) ఉదయం 9 గంటలకి సినిమా లాంఛనుంది.

దర్శకుడు సుకుమార్ ఒక‌వైపు సినిమాలు తెర‌కెక్కిస్తూనే మ‌రో వైపు మంచి చిత్రాల‌ని నిర్మిస్తున్నాడు. తాజాగా సుకుమార్ రైటింగ్స్ .. జీఏ2 పిక్చ‌ర్స్‌తో క‌లిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో చిత్ర టైటిల్ కూడా అనౌన్స్ చేయ‌నున్నారు.

సుకుమార్ స్టోరీ, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రంలో నిఖిల్ రోల్ వెరీ ఇంట్రస్టింగ్ గా ఉంటుందట. ఈ సినిమాలో నిఖిల్ సరసన నటించే హీరోయిన్ ఎవరో తెలియాల్సి ఉంది. ఇప్పటికే నిఖిల్ ..కార్తికేయ 2 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.