నిర్మల్ గిరిజన కుటుంబాలకు అండగా రానా..!

47
rana

హీరో రానా తన పెద్ద మనసు చాటుకున్నారు. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లోని 400 గిరిజన కుటుంబాలకు నిత్యావసర సరుకులు, మెడిసిన్స్ అందించారు.

కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గిరిజన గ్రామాల్లో మెడిసిన్స్ అందక వారు ప్రాణాలు కొల్పోతుండగా హీరో రానా తనవంతు సాయాన్ని అందించారు.

నిర్మల్ జిల్లాలోని గుర్రం మధిర, పాల రేగడి, అడ్డాల తిమ్మాపూర్, చింతగూడెం, గొంగురం గూడ గ్రామాల్లోని 400 కుటుంబాలకు మెడిసిన్స్, నిత్యావసర సరుకులు అందించారు. గత సంవత్సరం రానా తండ్రి నిర్మాత సురేశ్ బాబు సైతం కోటి రూపాయల విరాళాన్ని అందించారు.