- Advertisement -
అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ట్రంప్ శిబిరంలో కలవరం మొదలైంది. ఇప్పటివరకు హోరాహోరిగా ట్రంప్- బైడెన్ తలపడుతుండగా తాజాగా వస్తున్న సర్వేల ప్రకారం బైడెన్ ఆధిక్యంలో ఉన్నట్లు చెబుతున్నాయి సర్వేలు.
అమెరికన్ పౌరులలో రోజురోజుకూ ట్రంప్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని స్పష్టం చేస్తున్న సర్వేలు…ట్రంప్ కంటే బైడెన్ 8 శాతం ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించాయి. కరోనా వైరస్ ను ఎదుర్కోవడంలో ట్రంప్ సర్కార్ విఫలమైందన్న అభిప్రాయం అమెరికన్లలో బలంగా వ్యక్తమవుతోంది.
దీనికి తోడు పెరుగుతున్న నిరుద్యోగం, నల్లజాతీయులలో అభద్రత పెరగడం, ముస్లిం యువత కూడా విపక్షం వైపే చూస్తున్నట్లు తాజా సర్వేల్లో కనిపిస్తోంది.
- Advertisement -