తొలి సినిమాతో అక్కినేని ఫ్యాన్స్‌ని నిరాశపరిచిన అఖిల్, ‘హలో’ అంటూ ఫ్యాన్స్‌ని పలకరించినా..కమర్షియల్ హిట్‌ని మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. అయితే తన తదుపరి మూవీతోనైనా కమర్షియల్ హీట్ ని కొట్టాలని తెగ ట్రై చేస్తున్నాడు అఖిల్.
ఈ క్రమంలోనే రామ్ గోపాల్ వర్మ శిష్యుడి దర్శకత్వంలో అఖిల్ తన మూడో సినిమాని చెయ్యనున్నాడని టాక్.
అఖిల్ తన తదుపరి చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన మంజునాథ్ అనే యువ దర్శకుడి డైరెక్షన్‌లో మూవీ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రయల్ షూట్ కూడా చేశారన్న ప్రచారం జరుగుతోంది.
అంతేకాదు ఈ ట్రయల్ షూట్ లో వర్మ కూడా పాల్గొన్నట్టుగా వార్తలు వినిపించాయి. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఈ ఫొటోలు అఖిల్ తో వర్మ తెరకెక్కిస్తున్న షార్ట్ ఫిలింకు సబంధించినవన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన రావాల్సిఉంది.