వాళ్ళ అభిమానం వల్ల షూటింగ్ రద్దు చేసుకున్న సూర్య ..!

248
Suriya was mobbed by thousands of fans in Rajahmundry
- Advertisement -

సూర్య కు తమిళ, మలయాళం లోనే కాదు తెలుగులో కూడా భారీ క్రేజ్ ఉంది. సూర్య నటించే ప్రతి సినిమా తెలుగు లో కూడా బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టడం మనం చూస్తూనే ఉన్నాం. అంతలా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న సూర్య కి ఆ అభిమానమే కొంచెం ఇబ్బందికరంగా మారింది.

Suriya was mobbed by thousands of fans in Rajahmundry

ఇటీవల షూట్ లో భాగంగా రాజమండ్రి వచ్చిన సూర్య, అభిమానుల చేతులో చిక్కుకుపోయారు. సూర్య వెహికల్ దిగి నాలుగడుగులు వేశాడో లేదో, చుట్టూ ఉన్న వాళ్లంతా సూర్యను గుర్తుపట్టి వెంటనే షేక్ హ్యాండ్లూ,సెల్ఫీ లు అంటూ చుట్టుముట్టారు. నిమిషాల్లో దాదాపు 5 వేల మంది ఆయన చుట్టూ చేరారు. షూటింగ్ కోసం సెక్యూరిటీ ఇవ్వడానికి కేవలం నలుగురు లోకల్ పోలీసులు మాత్రమే రావడం తో అంతమందిని అదుపుచేయలేకపోగా సూర్యకి రక్షణ ఇవ్వలేకపోయారు. దాంతో తిరిగి వెహికల్ లోకి వెళ్ళిపోయినా సూర్య తప్పనిసరి పరిస్థితుల్లో షూటింగ్ రద్దు చేసుకున్నారు.

Suriya was mobbed by thousands of fans in Rajahmundry

మరుసటి రోజు భారీ సెక్యూరిటీని ఏర్పాటు చేసి తిరిగి షూటింగ్ ప్రారంభించారు చిత్ర బృందం. “ఎన్ జీ కె” సినిమా లో భాగంగా జరిగిన ఈ షూట్ ను పూర్తిచేసిన దర్శకుడు సెల్వ రాఘవన్ తిరుప్రయాణం లో అక్కడి అభిమానుల కోలాహలాన్ని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. రాజమండ్రి ఎంతో అందం గా ఉందని, ఇక్కడ షూటింగ్ చాలా ప్రశాంతంగా జరిగిందని పోస్ట్ చేసారు. డ్రీం వారియర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ చిత్రం ప్రకాష్ బాబు ,ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ , సాయి పల్లవి కథానాయికలుగా నటిస్తున్నారు.

- Advertisement -