సూర్య ‘ఎన్‌.జి.కె’ ట్రైలర్‌ వచ్చేసింది..

156
NGK Movie Tamil Trailer

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బ ందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’, ‘రిలయెన్స్‌ ఎంటర్టైన్మెంట్‌’ బ్యానర్‌లపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాల క ష్ణ). ఇదివరకే విడుదలైననీ సినిమా టీజర్‌,సాంగ్స్‌కి ట్రెమండెస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. మే 31న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు చిత్రబృందం.

ఇక ట్రైలర్‌ విషయానికొస్తే.. ‘ఓ చిన్న గుంపును వేసుకుని రాజకీయాల్లోకి వచ్చేస్తే.. నిన్ను రానిస్తారు అనుకున్నావా?’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. సూర్య రాజకీయ ప్రవేశంపై ఆయన తల్లి భయపడుతూ కనిపించారు. ‘ఇలా చదువుకున్న వాళ్లంతా మనకెందుకు అని పారిపోవడం వల్లే ఈ దేశం నాశనం అయిపోయింది’ అని ఓ వ్యక్తి బాధపడుతున్నారు. ‘రక్తం చిందించి ధాన్యం పండించే ఒక్కో రైతుకీ, ఈ దేశం బాగుండాలని కష్టపడే ఒక్కో కార్మికుడికి దేన్నైనా నిలదీసి అడిగే హక్కు ఉంది’ అంటూ సూర్య ఆవేశంతో ప్రసంగించడం ఆకట్టుకుంది. సూర్య సరసన సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీత అందిస్తున్నారు.

NGK - Official Trailer Tamil | Suriya, Sai Pallavi, Rakul Preet | Yuvan Shankar Raja | Selvaraghavan